![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1061 లో..... ఇందు, రాజు గొడవపడుతుంటే ఐశ్వర్య చూసి ఏంటి ఆ రాజు నేలపైన పడుకున్నాడు. అసలు వీళ్ళు ఇద్దరు భార్యాభర్తలేనా అని ఐశ్వర్య అనుకుంటుంది. వెంటనే ఈ విషయం రేఖ ఆంటీకి చెప్పాలని వెళ్తుంది. ఆంటీ ఆ ఇందు, రాజు గాడు మనల్ని మోసం చేస్తున్నారనిపిస్తుంది. ఒకసారి నాతో రండి అని ఐశ్వర్య తీసుకొని వెళ్తుంది. రాజు, ఇందు ఇద్దరు ఉన్న గది దగ్గరికి తీసుకొని వెళ్లి చూపిస్తుంది. తీరా రేఖ చూసేసరికి అక్కడ ఇందు, రాజు ఉండరు. వాళ్ళు గార్డెన్ లో ఉన్నట్లున్నారు ఆంటీ ఒకసారి వాళ్ల మాటలు వినండి మీకే డౌట్ వస్తుందని వాళ్ళు ఉన్న దగ్గరికి ఐశ్వర్య తీసుకొని వెళ్తుంది.
ఇక అక్కడికి వెళ్లేసరికి ఇందుని రాజు బ్రతిమిలాడుతాడు. ప్లీజ్ నాతో మాట్లాడు అంటాడు. ఏంటి వీళ్ళు ఇందాక గొడవపడ్డారు కదా.. ఇప్పుడు ఏంటి ఇలా చేస్తున్నారని ఐశ్వర్య అనుకుంటుంది. ఇందుని రాజు హగ్ చేసుకుంటాడు. ఇదంతా చూడడానికా నన్ను పిలిచింది.. నువ్వు నీ అనుమానం అని ఐశ్వర్యపై రేఖ కోప్పడి వెళ్ళిపోతుంది. వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళాక.. వాళ్ళు వెళ్ళారు యాక్టింగ్ ఆపమని రాజుతో ఇందు అంటుంది. ఆమ్మో ఈ ఐశ్వర్య చూసిందని అలెర్ట్ అయ్యాం లేకపోతే మొత్తం తెలిసిపోయేది అని రాజు అంటాడు. ఆ తర్వాత లక్కీకి ఐశ్వర్య ఫోన్ చేసి నిన్ను అర్జెంట్ గా కలవాలని రమ్మని చెప్తుంది. ఆ తర్వాత లక్కీ ద్వారా వాళ్ళ పెళ్లి గురించి నిజాలు తెలుసుకోవాలని ఐశ్వర్య ప్లాన్ చేస్తుంది. లక్కీ నాకొక హెల్ప్ చేస్తావా రాజు, ఇందు ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసుకోవా అని ఐశ్వర్య అనగానే లక్కీ టెంప్ట్ అయిపోయి సరే అంటాడు.
ఆ తర్వాత వెంకీ ఇంటికి వస్తాడు. ఎలా ఉందిరా నీ మొదటి రోజు జాబ్ అని వాళ్ళ నాన్న అంటాడు. బాగుందని వెంకీ చెప్తాడు. వెంకీ కాలికి సైకిల్ తొక్కి బొబ్బలు వస్తాయి. వాటిని చూసి ఏమైంది రా నువ్వు పోయేది సాఫ్ట్ వేర్ జాబ్ కా లేక రోడ్డుపై తిరిగే జాబ్ ఆ అని చలపతి అంటాడు. లేదు నాన్న కొత్త షూస్ కి అలా అయ్యాయని వెంకీ కవర్ చేస్తాడు. మరొకవైపు రాజుకి లక్కీ ఫోన్ చేసి చాలా రోజులవుతుందిరా సిట్టింగ్ వెయ్యక .. రా మామ అని లక్కీ అనగానే వెంకీ సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |